HomeTelugu TrendingMega Heroes ఐటమ్ నంబర్ హీరోయిన్ ల వేట ఎంత వరకు వచ్చింది?

Mega Heroes ఐటమ్ నంబర్ హీరోయిన్ ల వేట ఎంత వరకు వచ్చింది?

Mega Heroes in search of heroines for item numbers
Mega Heroes in search of heroines for item numbers

Mega Heroes Upcoming Movies:

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర షూటింగ్ నుంచి విరామం తీసుకున్నారు. ఆయన చికుంగున్యా వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రికవరీ మోడ్‌లో ఉన్నారు చిరు. విశ్వంబర చిత్రానికి సంబంధించిన టీమ్ ఈ నెల సెప్టెంబర్‌లో ఒక ప్రత్యేక పాటను చిత్రీకరించేందుకు ప్లాన్ చేసింది, కానీ చిరంజీవి ఆరోగ్య సమస్యల కారణంగా ఆ ప్రణాళికలను వాయిదా వేయాల్సి వచ్చింది.

ఈ పాటను అక్టోబర్‌లో చిత్రీకరించనున్నారు. అయితే పాట కోసం సరైన హీరోయిన్ కోసం హంటింగ్ జరుగుతోంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం చాలా స్టార్ హీరోయిన్ల పేర్లు చర్చలో ఉన్నాయి, కానీ ఇంకా అధికారికంగా ఎవరినీ ఎంపిక చేయలేదు. ఈ ప్రత్యేక పాట కోసం భారీ సెట్ ను నగరానికి సమీపంలోని ఒక విశాలమైన ప్రదేశంలో నిర్మించనున్నారు.

విశ్వంబర చిత్రం వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఒక సోషల్ ఫాంటసీ సినిమా. ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకిసంగీతాన్ని కీరవాణి అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ఇంకా మరో పక్క, అల్లుఅర్జున్ పుష్ప 2: ది రూల్ చిత్రంలో షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కూడా ఒక ఐటెం సాంగ్ ఉంది. దర్శకుడు సుకుమార్ తో పాటు టీమ్ గత ఆరు నెలలుగా సరైన నటి కోసం వెతుకుతున్నారు. శ్రీలీల, త్రిప్తి డిమ్రీ, సమంత ఇలా చాలానే పేర్లు చర్చలో ఉన్నాయి. ఈ పాట చిత్రీకరణ ప్రధాన షూటింగ్ పూర్తయిన తరువాత అక్టోబర్ చివరి వారంలో జరుగనుంది.

ఈ స్పెషల్ సాంగ్ కోసం రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఒక మంచి ట్యూన్‌ని రూపొందించారు. అన్నీ రెడీ కానీ పాట షూటింగ్ కోసం సరైన నటి దొరకకపోవడం వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది. మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డిసెంబర్ 6న విడుదల కాబోతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు.

Read More: Devara సినిమా నుండి దావుడి పాట తీసేసింది ఎవరో తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu