Jai Hanuman Update:
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ జాంబిరెడ్డి వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ మధ్యనే సంక్రాంతి సందర్భంగా ఆ విడుదలైన హనుమాన్ సినిమాతో.. ప్రశాంత్ వర్మ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. తేజ సజ్జ హీరోగా.. ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.
ఈ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు జై హనుమాన్ సినిమా కూడా లైన్లో ఉంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగంలో ఆంజనేయ స్వామి పాత్ర కళ్ళు మాత్రమే చూపించారు. జై హనుమాన్ సినిమాలో ఆంజనేయుడి పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు అని సర్వత్ర ఆసక్తి నెలకొంది.
ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్రం నిర్మాత చైతన్య రెడ్డి కూడా.. హనుమంతుని పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కానీ రామ్ చరణ్ కానీ అయితే బాగుంటుంది అని అన్నారు. మెగా హీరోలలో ఎవరో ఒకరిని ఆ పాత్రలో చూడడానికి అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు ప్రశాంత్ వర్మ కూడా ఏదో ఒక మెగా హీరోని రంగంలోకి దింపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. ముఖ్యంగా ప్రశాంత్ వర్మకి చిరంజీవి హనుమంత్రి పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని అనిపిస్తోంది. కానీ ప్రస్తుతం వరుస సినిమాలతో చిరంజీవి బిజీగా ఉన్నారు. కనీసం మూడేళ్ల పాటు చిరంజీవి.. వేరే సినిమాల షూటింగ్లలో పాల్గొనే అవకాశం లేదు. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న చిరు మోహన్ రాజా దర్శకత్వంలో కూడా ఒక సినిమా సైన్ చేశారు.
మరి తన కమిట్మెంట్లు పూర్తి చేసుకున్నాక చిరంజీవి జై హనుమాన్ సినిమాకి డేట్ లో కేటాయిస్తారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ ఎంతైనా భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ప్రీ ప్రొడక్షన్ పూర్తవడానికి కనీసం సంవత్సరమైనా పడుతుంది. మరోవైపు ప్రశాంత్ వర్మ కూడా నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమా కూడా పూర్తవడానికి సమయం పడుతుంది.
మరి ఇద్దరూ ఫ్రీ అయ్యాక చిరంజీవితో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా తీస్తే క్రేజీ కాంబినేషన్ అవుతుంది అని ఫాన్స్ ఇప్పటినుంచే చెబుతున్నారు. పైగా హనుమన్ సినిమాలో హనుమంతుని పాత్ర ఎక్కువసేపు కనిపించదు. కాబట్టి ఆ సినిమాలో క్యామియోనే కాబట్టి ఎవరైనా డేట్ లు ఇవ్వగలరు. కానీ జై హనుమాన్ సినిమా షూటింగ్ కి ఎక్కువ కాలమే పడుతుంది. మరి అన్ని రోజులు వీలు చూసుకొని డేట్స్ ఇచ్చే మెగా హీరో ప్రశాంత్ వర్మకి దొరుకుతారో లేదో చూడాలి.