బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ‘ఎన్టీఆర్’ చిత్రంలో ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు పాత్రను పోషించే అవకాశం మెగాబ్రదర్ నాగబాబుకు వచ్చిందట. స్వయంగా దర్శకుడు క్రిష్ ఈ పాత్ర కోసం నాగబాబును కలిశారట.
కానీ నాగబాబు మాత్రం ఆ పాత్రను చేయడానికి నిరాకరించారని తెలుస్తోంది. అయితే ఆ నిరాకరణకు కారణం ఏమిటనేది మాత్రం తెలియలేదు. దీంతో ఎస్వీఆర్ పాత్రకు వేరొక నటుడ్ని చూసుకున్నారట క్రిష్. ఈ బయోపిక్ లో మొదటి భాగమైన ‘కథానాయకుడు’ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.