హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఆది పినిశెట్టి ‘సరైనోడు’ సినిమాలో విలన్ గా
కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. హీరోగా కంటే విలన్ గా నటించినందుకే ఆదికి ఎక్కువ
మార్కులు పడ్డాయి. ఆ తరువాత విలన్ గా ఎన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆది వేటినీ
అంగీకరించలేదు. హీరోగానే సెటిల్ అవ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈలోగా
మెగా హీరో సినిమాలో మరోసారి విలన్ గా నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సాయి ధరం తేజ్ హీరోగా నటిస్తోన్న చిత్ర్హమ్ ‘విన్నర్’. ఈరోజు
సాయి ధరం తేజ్ పుట్టినరోజు సంధర్భంగా సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ
సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి సెట్ అవుతాడని భావించిన చిత్రబృందం ఆయన్ను విలన్
గా నటించడానికి ఒప్పించినట్లు తెలుస్తోంది. అలానే నాని హీరోగా శివ అనే దర్శకుడు
రూపొందిస్తోన్న సినిమాలో కూడా విలన్ గా ఆది నటించనున్నాడని సమాచారం.