HomeTelugu TrendingAllu Arjun: మహేశ్ బాబు కి దొరికిన సమయం బన్నీ కి దొరకలేదా?

Allu Arjun: మహేశ్ బాబు కి దొరికిన సమయం బన్నీ కి దొరకలేదా?

Mega fans troll Allu Arjun for not supporting Committee Kurrollu
Mega fans troll Allu Arjun for not supporting Committee Kurrollu

Allu Arjun Controversy:

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం నుంచి.. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ల మధ్య జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. అప్పుడు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకుండా తన స్నేహితుడికి సపోర్ట్ చేసినందుకు అల్లు అర్జున్ ని మెగా అభిమానులు ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాళ్ళలో వాళ్ళు బాగానే ఉంటారు అని.. వాళ్లంతా ఒకటే అని చెప్పడానికి ఒక్క సందర్భం చాలు అని అన్నారు.

కానీ అలాంటి సందర్భం వచ్చినా కూడా అటు Allu Arjun కానీ.. మెగా కుటుంబ సభ్యులు కానీ వినియోగించుకోకపోవడం ఫాన్స్ ని నిరాశకు గురిచేస్తుంది. ఈ మధ్యనే నిహారిక నిర్మాతగా కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో మెగా హీరోలు అందరూ నిహారిక సపోర్ట్ చేస్తూ ట్వీట్లు చేశారు.

రామ్ చరణ్ వంటి వారు సినిమా విడుదల అయ్యాక చాలా బాగుంది అంటూ శుభాకాంక్షలు చెప్పారు. కానీ అల్లు అర్జున్ నుంచి ఒక్క ట్వీట్ కూడా రాలేదు. ఆఖరికి సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా సమయం చూసుకొని మరీ నిహారిక శుభాకాంక్షలు చెప్పారు కానీ బన్నీ కి ఆ సమయం కూడా కుదరలేదా అంటూ మెగా అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు.

ఇది చాలదు అన్నట్టు నిహారిక సినిమాని పట్టించుకోకుండా అల్లు అర్జున్ బన్నీ వాసు నిర్మించిన ఆయ్ సినిమా గురించి ట్వీట్ వేయడం మెగా అభిమానులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. మరోవైపు బన్నీ అభిమానులు కూడా నిహారిక చిత్ర ఈవెంట్ లో మాట్లాడుతూ మెగా హీరోలు అందరి పేర్లు చెప్పింది కానీ.. అల్లు అర్జున్ పేరు చెప్పలేదు అని గుర్తు చేస్తున్నారు.

ఏదేమైనా ఫాన్స్ మధ్య సోషల్ మీడియాలో బాగానే గొడవలు జరుగుతున్నాయి. నిహారిక అల్లు అర్జున్ ని సంప్రదించి సినిమా గురించి చెప్పిన బాగుంటుంది అని బన్నీ అభిమానులు అంటుంటే.. మరొకవైపు మెగా అభిమానులు మాత్రం బన్నీ నే చొరవ తీసుకొని సినిమా గురించి మాట్లాడితే బాగుంటుంది అని అంటున్నారు. ఏది ఏమైనా విరి మధ్య గొడవలు కి మాత్రం ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలాగా కనిపించడం లేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu