HomeTelugu Trendingకరోనాపై మెగా ఫ్యామిలీ సందేశం..

కరోనాపై మెగా ఫ్యామిలీ సందేశం..

4 15

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విలయతాడవం చేస్తుంది. ఈ నేపద్యంలో ఈ వైరస్ వ్యాప్తి పూర్తిగా అరికట్టబడానికి లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేయడమే మార్గం అంటున్నారు. సెలబ్రెటీలు, సోషల్ మీడియాలు సైతం ఇదే చెబుతున్నాయి. తాజాగా మెగా ఫ్యామిలీ కూడా కరోనా నియంత్రణ పై ఓ మెసేజ్ ఇచ్చారు. ఇప్పటికే కరోనా కట్టడిలో భాగంగా మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్స్ భారీ విరాళాలు అందించారు. కరోనాపై అవగాహన కల్పించేలా అనేక సూచనలు చేస్తున్నారు.’స్టేహోం, ఇంట్లో ఉంటాం, యుద్ధం చేస్తాం, క్రిమిని కాదు ప్రేమను పంచుతాం.. కాలు కదపకుండా కరోనాని తరిమేస్తాం.. భారతీయులంతా ఒక్కటై భారత్‌ని గెలిపిస్తాం.. స్టే సేఫ్‌’ అని మెగా కుటుంబంలోని వారంతా కలిసి సందేశం ఇచ్చారు. మెగాస్టార్ కూడా తరచు ట్విట్టర్ లో కరోనా నియంత్రణ పై అవగాహన కల్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరు ఈ ఫోటోలో మిస్ కాగా.. ఫ్యాన్స్‌ పవన్‌ కనిపించక పోవడంతో.. పవన్‌ ఎక్కడా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu