రామ్‌చరణ్ భార్య ఉపాసన సీమంతం దుబాయ్‌లో అత్యంత ఘనంగా జరిగింది. కొందరు ముఖ్యమైన సన్నిహితుల మధ్య హైదరాబాద్‌లో మరో రెండు వేడుకలు వైభవంగా జరిగాయి. ఉపాసన పింక్ షిమ్మరీ వస్త్రాలంకరణతో మెరిసిపోయారు.
ఈ పార్టీలకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ చెల్లెళ్లు సుస్మిత, శ్రీజతో పాటు ఉపాసన తల్లి శోభన కామినేని, సంగీతారెడ్డి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఉపాసన ఫ్రెండ్స్ పింకీ రెడ్డి, సానియా మీర్జా, కనికా కపూర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో పాల్గొని అలరించారు. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కూడా హాజరవ్వడం విశేషం.
మరి కొద్దిరోజుల్లో ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. తల్లికాబోతున్న ఉపాసనను తమ ప్రేమాభిమానాలతో అందరూ ముద్దు చేశారు. ఈ ఫంక్షన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చరణ్ దంపతులు పెళ్లై దాదాపు పదేళ్ల తర్వాత తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయం ఆయన కుటుంబంలో మాత్రమే కాదు మెగా అభిమానుల్లోనూ ఆనందం నింపింది. మెగా వారసుడి కోసం అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు