HomeTelugu Big Storiesచిరంజీవి బ్లడ్‌ బ్రదర్ మృతి

చిరంజీవి బ్లడ్‌ బ్రదర్ మృతి

Mega family emotional about

మెగాస్టార్‌ చిరంజీవి వీరాభిమాని ప్రసాద్‌రెడ్డి తుది శ్వాస విడిచాడు. దిరి ప్రాంతానికి చెందిన ప్రసాద్ రెడ్డి హైదరాబాద్ కు వెంకటరమణ కొవిడ్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. చిరంజీవి యువత అధ్యక్షుడిగా అనేక సేవా కార్యక్రమాలను నడిపించిన ఆయన ఇక లేడన్న విషయం తెలిసిన మెగా హీరోలు సోషల్‌ మీడియా ద్వారా అతడికి సంతాపం ప్రకటించారు. ‘నా బ్లడ్‌ బ్రదర్స్‌ ప్రసాద్‌ రెడ్డి, వెంకటరమణ కరోనా బారిన మరణించారన్న వార్త నా హృదయాన్ని కలిచివేసింది’ అని మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఈ క్రమంలో మెగా బ్రదర్‌ నాగబాబు ఇన్‌స్టాగ్రామ్‌లో అతడితో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఊహ తెలిసినప్పటి చిరంజీవి అన్నయ్య అభిమానిగా ప్రయాణాన్ని ప్రారంభించాడు. కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత భేదాలు లేకుండా వ్యవహరించేవాడని అతడి గొప్పతనాన్ని వివరించాడు. మన కులం, అభిమాన కులం… మన మతం – సేవామతం.. అని నిస్వార్థంగా పని చేశాడని చెప్పుకొచ్చాడు. రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన తమ్ముడు ప్రసాద్‌రెడ్డి మరణం కలచి వేసిందని ఉద్విగ్నతకు లోనయ్యాడు. వ్యక్తిగతంగా కూడా ప్రసాద్ ప్రతి చిన్న విషయాన్ని తనతో పంచుకునేవాడని గత జ్ఞాపకాల గుర్తు చేసుకున్నాడు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తూ… అతని భార్య, పిల్లలకు తాము, తమ అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటామని రాసుకొచ్చాడు. సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌ తేజ్‌ కూడా ట్వీట్‌ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu