HomeTelugu Newsమెగా ఈవెంట్ హైలెట్స్!

మెగా ఈవెంట్ హైలెట్స్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’. రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే ఆన్ లైన్ విడుదలయ్యి సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఈ సినిమా జనవరి 11న
విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సంధర్భంగా సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ గుంటూరు హాయ్ ల్యాండ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరు చెప్పిన డైలాగ్, చిరు గురించి దాసరి చెప్పిన మాటలు హైలైట్ గా నిలిచాయి.
అదే మాసూ.. అదే గ్రేసూ..
”రాననుకున్నారా.. రాలేననుకున్నారా.. డిల్లీకి పోయాడు.. డాన్సులకు దూరం అయిపోయాడు.. హస్తినాపురానికి పోయాడు హాస్యానికి దూరమైపోయాడు.. ఈ మధ్య కాలంలో మా మధ్య లేదు.. మాస్ కి దూరమైపోయాడు అనుకుంటున్నారేమో.. అదే మాసూ.. అదే గ్రేసూ.. అదే హోరూ.. అదే జోరూ.. అదే హుషారూ..” అంటూ చిరు తన అభిమానులకు చెప్పిన డైలాగ్ మొత్తం కార్యక్రమంలో హైలైట్ గా నిలిచింది. అంతేకాదు దర్శకుడు వినాయక్ తనకు నాగబాబు, పవన్ కల్యాణ్ లతో సమానమని చెప్పి అభిమానులకు ఆనందాన్ని కలిగించారు. తనకు అభిమాని అయిన వినాయక్ కు తెరపై తనను ఎలా చూపించాలో.. బాగా తెలుసని ఈ సంధర్భంగా చిరు చెప్పారు.
జనం చూస్తారా..?, ఫైట్స్ చేస్తారా..?, డాన్స్ చేస్తారా..?..
ఎక్కడ చిరంజీవి ఉంటే అక్కడ జన సముద్రం ఉంటుంది. ఒక ఖైదీ, ఒక పసివాడి ప్రాణం, ఒక ఘరానా మొగుడు ఇలా కొన్ని అధ్బుతమైన కార్యక్రమాలు గుంటూరులో జరిగాయి. మళ్ళీ ఎనిమిది సంవత్సరాల తరువాత తిరిగి నటించడం మొదటిసారి అది చిరంజీవి. ఆయన ముఖానికి ఎప్పుడు మేకప్ వేసుకుంటాడు.. ఎప్పుడు నటిస్తాడు అని ఎందరో మెగాభిమానులు ఎదురుచూస్తోన్న ప్రశ్నకు జవాబు ‘ఖైదీ నెంబర్ 150’. జనం చూస్తారా..?, ఫైట్స్ చేస్తారా..?, డాన్స్ చేస్తారా..? అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అతడ్ని చూస్తుంటే ఎంతో యంగ్ గా కనిపిస్తున్నాడు. దీని వెనుక ఆయన ఏడాది కష్టం ఉంది. ఈ సినిమా కథ నాకు తెలుసు. ఇంటర్వల్ లో చిరు చేసిన ఫైట్ హైలైట్ గా నిలుస్తుంది. సమాజానికి సందేశం ఇవ్వాలని చేసిన చిత్రమిది. చిరుకి వినాయక్ ఎన్నో ఘన విజయాలు ఇచ్చాడు. ఇప్పుడు కూడా అటువంటి పెద్ద హిట్ ఇచ్చే సినిమా రూపొందించాడు. ఒక స్టార్ కొడుకు రామ్ చరణ్ స్టార్ తో సినిమా చేయడం ఇదొక రికార్డ్ అని దాసరి నారాయణరావు అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu