Homeతెలుగు News‘మహా’ విరాళం: కరోనాపై పోరులో ముందున్న ‘మేఘా’

‘మహా’ విరాళం: కరోనాపై పోరులో ముందున్న ‘మేఘా’

కరోనాపై పోరులో ప్రజలకు, ప్రభుత్వానికి మద్దతుగా ప్రముఖ పారిశ్రామిక సంస్థ ‘మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్(మెయిల్)’ నిలిచింది. దేశంలో కరోనా కోరల్లో చిక్కుకున్నప్పుడు తాము చేతులు కట్టుకొని ఉండిబోమంటూ ‘మేఘా’ ప్రకటించింది. తమవంతు బాధ్యతగా పలు రాష్ట్రాలకు ‘మెయిల్’ భారీ విరాళాలను ప్రకటించింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ మొత్తంలో విరాళాలను ప్రకటించి కరోనాపై పోరులో తెలుగు ప్రజలకు మద్దుతగా నిలిచింది ‘మేఘా’. తెలుగు రాష్ట్రాలతోపాటు మరికొన్ని రాష్ట్రాలకు భారీ విరాళాలను ప్రకటించి ‘మేఘా’ ఉదారతను చాటుకుంది.

mega help from megha rs 2 crore to fight corona

ప్రముఖ పారిశ్రామికి సంస్థ ‘మేఘా’ ఇప్పటికే ఏపీకి రూ.5 కోట్లు, తెలంగాణకు రూ.5కోట్లు, కర్ణాటకకు రూ.2కోట్లు, ఒడిషాకు ఒక కోటిని విరాళంగా ప్రకటించి తన ఉదారతను చాటుకుంది. తాజాగా మహారాష్ట్ర సర్కారుకు ‘మేఘా’ భారీ విరాళాన్ని ప్రకటించింది. ఆ రాష్ట్రానికి 2 కోట్లు విరాళం ప్రకటించింది. ఈమేరకు ఆ సంస్థ నిర్వాహాకులు మహారాష్ట్ర సర్కారుకు ఈ మొత్తాన్ని అందజేయనున్నారు. దేశంలో ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రజలకు నేనున్న అంటూ ‘మేఘా’ సంస్థ భారీ విరాళాన్ని ప్రకటించడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి ప్రజలకు సర్కార్ అందించే సాయానికి తోడు ‘మేఘా’ అందించే విరాళం కొంత ఊరట కలిగించనుందనడంలో సందేహమేమీ లేదు.

దేశంలో లాక్డౌన్ నేపథ్యంలో ప్రజారవాణా స్తంభించిపోయింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో రోజువారీ దినసరి వేతనంపై పని చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు, 24గంటలు కరోనాపై పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, మీడియా వాళ్లకు ‘మేఘా’ తనవంతు సహకారం అందజేస్తూ మంచి మనస్సును చాటుకుంది. సామాజిక సేవలో ‘మేఘా’ వంటి ప్రముఖ పరిశ్రమలు ముందుకు రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కార్పొరేట్ సంస్థలు కేవలం లాభాలే చూసుకుంటాయని.. వారికి సామాన్యుల గోడు పట్టదు.. అనే వారికి ‘మేఘా’ లాంటి సంస్థలు కనువిప్పు కలిగేలా చేస్తున్నాయి. సామాజిక సేవ కార్యక్రమాల్లో ముందుంటూ సోషల్ రెస్పాన్సిబిటీని ‘మేఘా’ పాటిస్తుంది. ‘మేఘా’ చేస్తున్న పనిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ‘మేఘా’ను ఆదర్శంగా తీసుకొని ప్రజలు విపత్కరణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తమవంతు సహకారం అందించాలని పలువురు కోరుతున్నారు. ‘మేఘా’ సంస్థ పేరు తగ్గట్టుగానే కరోనాపై పోరుకు భారీ విరాళాలను ప్రకటిస్తూ గర్జిస్తుందని పలువురు అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu