మెగాడాటర్ నిహారిక కొణిదెల ఒక వైపున తనదైన శైలిలో ఒక పద్దతిగా సినిమాలు చేస్తూనే ఉంది. అంతేకాదు..మరోవైపు తన టేస్ట్‌కు తగ్గ వెబ్ సిరీస్‌లు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇక నిహారిక నటించిన ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’ తాజాగా నటించిన ‘సూర్యకాంతం’ సినిమాలేవి నిహారికకు హిట్టు ఇవ్వలేకపోయాయి. దాంతో నిహారిక సినిమాలను పక్కనపెట్టి వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించింది. తాజాగా నిహారకి తన ఓన్ బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై ‘మ్యాడ్ హౌస్’ అనే రొమాంటింక్ కామెడీ డ్రామాతో నడిచే వెబ్ సిరీస్ చేస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ను మహేష్ ఉప్పల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ 100 ఎపిసోడ్‌లుగా రానుంది.