HomeTelugu Big Storiesప్రభాస్‌ ఎక్కడా.. నేనెక్కడ?.. నిహారిక షాకింగ్‌ కామెంట్స్‌‌!

ప్రభాస్‌ ఎక్కడా.. నేనెక్కడ?.. నిహారిక షాకింగ్‌ కామెంట్స్‌‌!

12 17
మెగా డాటర్‌ నిహారిక నిన్న మొన్నటి వరకు చాలా పద్దతిగా కనిపించేది. అయితే ఇప్పుడు బయట మాత్రం హాట్ హాట్‌గా దర్శనమిస్తుంది. మొన్నామధ్య బీచ్‌లో రెచ్చిపోయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరోసారి ఇదే చేసింది. ఇకపై కూడా ఇదే చేస్తానని చెప్పింది. ఇప్పట్నుంచి తాను మోడ్రన్ డ్రస్‌లో కనిపిస్తానని.. రొమాంటిక్ రోల్స్ కూడా చేస్తానని చెబుతుంది. నిజానికి తన తర్వాతి సినిమాలో పూర్తి రొమాంటిక్ పాత్రలో చేస్తున్నట్లు కూడా అభిమానులకు తెలిపింది నిహారిక. తెలుగులో పెద్దనాన్న సినిమా ‘ఆచార్య’లో చిన్న పాత్రలో నటించబోతుంది నిహారిక. ఇదిలా ఉంటే పెళ్లి గురించి కూడా ఇప్పుడు ఈమెను కొన్ని ప్రశ్నలు అడిగారు ఫ్యాన్స్.

కొన్ని రోజులుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. సింపుల్‌గా వెబ్ సిరీస్‌లు చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటుంది నిహారిక. ఇదిలా ఉంటే కొన్ని రోజుల కింద ప్రభాస్‌తో నిహారిక పెళ్లి అంటూ వార్తలొచ్చాయి. ఇదే ప్రశ్నను ఇప్పుడు సోషల్ మీడియాలో నిహారికను ఓ అభిమాని అడిగాడు. ‘ప్రభాస్‌ను ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నారా అక్క’ అని అడిగితే.. ‘నేను ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడం ఏంటండి.? ఆయనెక్కడ.? నేనెక్కడ.?’ అంటూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది నిహారిక. అలాంటి రూమర్స్ ఎలా వస్తాయో తెలియదంటుంది. గతంలో కూడా సాయి ధరమ్ తేజ్‌తో పెళ్లి అంటూ రూమర్స్ వచ్చాయి. మొత్తానికి ప్రభాస్‌తో పెళ్లనేది సొల్లు అంటుంది కొణిదెల వారమ్మాయి.

తన కుటుంబంలో అందరూ తనతో చాలా కూల్‌గా ఉంటారని.. క్లోజ్‌గా ఉంటారని చెబుతుంది. తన అన్నయ్య వరుణ్ తేజ్ కాకుండా చరణ్ అంటే తనకు చాలా ఇష్టమని చెబుతుంది నిహారిక. అంతేకాదు.. తన ఫ్యామిలీలో మిగిలిన వాళ్లు కూడా ఫ్రీగా ఉంటారంటుంది. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తనను ఆట పట్టిస్తుంటారని చెబుతుంది. ఇక శ్రీజ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని.. స్నేహా రెడ్డి కూడా తనతో చాలా క్లోజ్‌గా ఉంటుందని చెప్పింది. చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ఖిలాడీ అని.. తన గురించి చాలా సీక్రేట్స్ తెలుసని చెబుతుంది నిహారిక. మొత్తానికి లాక్ డౌన్ సమయంలో ఇచ్చిన లైవ్‌లో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చింది మెగడాటర్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu