HomeTelugu Trendingచిరంజీవి 154 మూవీ అప్డేట్‌

చిరంజీవి 154 మూవీ అప్డేట్‌

mega 154 movie update
మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. దానిలో బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇది చిరు 154వ చిత్రం. తాజాగా ఈమూవీ టీం మెగాఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ సినిమా డబ్బింగ్‌ పనులు ప్రారంభించినట్లు వెల్లడించింది. డైరెక్టర్‌ బాబీ, పలువురు టెక్నిషియన్స్‌ సమక్షంలో లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి డబ్బింగ్‌ పనులు మొదలుపెట్టారు.

ఈ విషయాన్ని ఈమూవీ నిర్మాణ సంస్థ మైత్రీ మేకర్స్‌ వెల్లడించారు. త్వరలోనే మరిన్నీ భారీ అప్డేట్స్‌ ఈ సందర్బంగా మైత్రి మేకర్స్‌ తెలిపారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్‌ రానున్నట్లు తెలుస్తుంది. శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాలో రవితేజ కీలకపాత్రలో కనిపించనున్నాడు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి14న ఈ సినిమాను విడుదల చేసేందుకు మూవీ యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

https://www.instagram.com/p/CjrmK53hs9u/?utm_source=ig_web_copy_link

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu