చిరు సెట్ లోకి వెళ్ళాడు!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. మెగా స్టార్ 150సినిమా షూటింగ్ మొదలైయింది. కొద్ది సేపటిక్రితమే యాక్షన్ లోకి దిగిపోయారు మెగాస్టార్. ఈ విషయాన్ని తనయుడు రామ్ చరణ్ ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘నా ప్రతి పనికి నాన్న ఎప్పుడూ మద్దతుగా నిలుస్తారు. నాన్న నటించిన చిత్రానికి నేను నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి బిడ్డ తన తల్లిదండ్రుల రుణం కొంతయినా తీర్చుకోవాలని అనుకుంటారు. ఆ సమయం ఇప్పుడు తనకు వచ్చిందని భావిస్తున్నా’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు చరణ్. ఈ సెట్ లో మెగాస్టార్ చిరంజీవి, అలీ పాల్గొనగా టాకీ పార్టీ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. వచ్చే నెల 12 న వరకు ఈ షెడ్యూల్ హైద్రాబాద్ లోనే జరగనుంది. తమిళ్ సినిమా కత్తికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వినాయక్ దర్శకుడు. చిత్రానికి దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నాడు.