Ratan Tata successor:
రతన్ టాటా ఆకస్మిక మరణం టాటా ట్రస్ట్స్‌కి నాయకత్వ సమస్యను సృష్టించింది. చాలా మంది నాయకులు ఈ పదవికి బరిలో ఉన్నా, రతన్ టాటా తమ్ముడు నోయెల్ టాటా చివరకు చైర్మన్‌గా ఏకగ్రీవంగా నియమించబడ్డారు. టాటా స్టీల్, టాటా టిటాన్ కంపెనీలకు వైస్ చైర్మన్‌గా ఉన్న నోయెల్, రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కొడుకు.
నోయెల్ టాటా 2000 నుంచి టాటా గ్రూప్‌లో కీలకపాత్రల్లో ఉన్నారు. అనేక విజయవంతమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించి, వ్యాపార అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ నియామకంతో, నోయెల్ టాటా టాటా ట్రస్ట్స్‌కి నూతన యుగం ప్రారంభించారు. ప్రస్తుతం వేను శ్రీనివాసన్, విజయ్ సింగ్, మెహ్లి మిస్ట్రి కూడా టాటా ట్రస్ట్స్ కార్యనిర్వాహక కమిటీలో ఉన్నారు.
రతన్ టాటా మరణం తరువాత, వ్యాపార ప్రపంచం శూన్యంలో ఉండిపోయింది. టాటా గ్రూప్ నాయకత్వంలో ఉన్నారు గానీ రతన్ టాటా తమ్ముడు జిమ్మీ టాటా కుటుంబ వ్యాపారంలో ఎప్పుడూ పాల్గొనలేదు. ముంబైలోని కొలాబాలో ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న జిమ్మీ టాటా, సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.
Read More: Ratan Tata చేతుల్లో ఎన్ని కంపెనీస్ పని చేసేవో తెలుసా?