డిసెంబర్ 16, 2012న నిర్భయపై అతి కిరాతకంగా అత్యాచారం చేసిన ఆపై ఆమె మరణానికి కారణమైన ఆరుగురు నిందితులను పోలీసులు పట్టుకొని శిక్ష పడేలా చేశారు. ఇందులో ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ళ శిక్ష పడింది. ఆ శిక్ష తరువాత అతను బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఏమయ్యాడో తెలియదు. ఇక జైల్లోనే మరో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 2015లో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటె, ప్రస్తుతం తీహార్ జైల్లో నిర్భయ దోషులు నలుగురు ఉన్నారు. వీరికి ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నది. ఉరికి సంబంధించిన ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు జైలు అధికారులు. డిసెంబర్ 16 తరువాత ఈ నలుగురు దోషులను ఉరి తీస్తారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు నలుగురు దోషులకు ఉరి తీసేందుకు 10 ఉరితాళ్లు సిద్ధం చేసింది తీహార్ జైలు. అదే విధంగా తలారి జలాద్ ను కూడా సిద్ధంగా ఉండమని చెప్పింది. తలారిలను ఎంపిక చేయగా అందులో ఒకరికి అనారోగ్యంగా ఉండటంతో జలాద్ ను ఎంపిక చేసింది. ఎవరిని ఉరితీయబోతున్నారు అనే విషయం తనకు ఇంకా తెలియదని, లిస్ట్ తన దగ్గరకు రాలేదని అంటున్నాడు జలాద్. తనకు ఆదేశాలు అందితే సిద్ధంగా ఉంటానని అన్నాడు.