HomeTelugu TrendingMeenakshi Chaudhary: ప్యాన్ ఇండియా సినిమాల వల్ల భయపడుతున్న హీరోయిన్

Meenakshi Chaudhary: ప్యాన్ ఇండియా సినిమాల వల్ల భయపడుతున్న హీరోయిన్

Meenakshi Chaudhary opens up about her upcoming big projects
Meenakshi Chaudhary opens up about her upcoming big projects

Meenakshi Chaudhary Telugu Movies:

ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయింది మీనాక్షి చౌదరి. సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయినా.. మీనాక్షికి మాత్రం హీరోయిన్ గా మంచి పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఇండస్ట్రీ నుంచి.. వరుస ఆఫర్లు కూడా వచ్చి పడ్డాయి.

ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన.. గుంటూరు కారం సినిమాలో కూడా ఆఫర్ అందుకుంది మీనాక్షి. ఆ సినిమాలో మహేష్ బాబు మరదలు పాత్రలో మెప్పించింది. ఒక పల్లెటూరి అమ్మాయి పాత్ర అయినప్పటికీ.. తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంది.

మరోవైపు కోలీవుడ్ లో కూడా కొలై అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి హీరోయిన్ గా.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన GOAT సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా కనిపించనుంది. తెలుగులో కూడా చిరంజీవి సరసన విశ్వంభర సినిమాలో నటిస్తోంది.

మరోవైపు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న మెకానిక్ రాకీ.. మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ మట్కా.. అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలను కూడా లైన్లో పెట్టింది ఈ భామ. ఇందులో చాలా వరకు సినిమాలు ఆగస్టు, సెప్టెంబర్లలో విడుదల కాబోతున్నాయి.

ఈ సినిమాల పైన తన ఆశలన్నీ పెట్టుకుంది మీనాక్షి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చాలావరకు ఈమె చేతిలో ఉన్న సినిమాలు పాన్ ఇండియా రేంజ్ సినిమాలు. కానీ పాన్ ఇండియా సినిమాలు అంటే భయం గా ఉంది అంటూ మీనాక్షి చేసిన కామెంట్ లు అందరికీ షాక్ ఇచ్చాయి.

అయితే మీనాక్షి భయపడడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఈ రేంజ్ సినిమాలు చేశాక.. హిట్ అయితే పర్లేదు కానీ ఫ్లాప్ అయితే మాత్రం అది తన కెరియర్ మీద ప్రభావం చూపిస్తుంది. మరోవైపు ఫాన్స్ మాత్రం.. ఆమె సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీనాక్షి అదృష్టం ఎలా ఉందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu