నటీనటులు: అల్లరి నరేష్, నిఖిలా విమల్, అవసరాల శ్రీనివాస్, హైపర్ ఆది తదితరులు
సంగీతం: షాన్ రహ్మాన్
సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్.కుమార్
ఎడిటింగ్: నందమూరి హరి
నిర్మాత: బొప్పన చంద్రశేఖర్
దర్శకత్వం: జి.ప్రజిత్
‘సుడిగాడు’ సినిమా తరువాత అల్లరి నరేష్ కు చెప్పుకునే స్థాయిలో హిట్టు సినిమా పడలేదు. దీంతో ఈసారి సక్సెస్ అందుకోవాలని మలయాళంలో విజయ్ సాధించిన ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ అనే సినిమాను తెలుగులో ‘మేడ మీద అబ్బాయి’ అనే పేరుతో రీమేక్ చేశాడు నరేష్. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎంతమేరకు ఆడియన్స్ ను
ఆకట్టుకుందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
శ్రీను(అల్లరి నరేష్)కి చదువు మీద పెద్ద ఆసక్తి ఉండదు. ఇంజనీరింగ్ పూర్తయ్యేసరికి ఇంకా 26 సబ్జెక్ట్స్ బ్యాలన్స్ పెట్టుకుంటాడు. తన స్నేహితులతో కలిసి లఘు చిత్రాలను రూపొందిస్తుంటాడు. కానీ వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. కొన్నిరోజులకు శ్రీను ఎదిరింట్లో సింధు(నిఖిల) అనే అమ్మాయి అద్దెకు దిగుతుంది. మొదటిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. అయితే ఇంట్లో తన తండ్రి పోరు భరించలేక హైదరాబాద్ వెళ్ళి డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు శ్రీను. దానికోసం హైదరాబాద్ బయలుదేరతాడు. ట్రైన్ లో అతడికి సింధు కనిపిస్తుంది. తనతో ఓ సెల్ఫీ తీసుకొని స్నేహితులకు పంపిస్తాడు శ్రీను. ఆ సెల్ఫీ కారణంగా శ్రీను ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు..? హైదరాబాద్ లో శ్రీనుకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
ఒరిజినల్ చిత్ర దర్శకుడు ప్రజీత్ తెలుగు సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. అయితే కథలో మెయిన్ పాయింట్ మీద దృష్టి పెట్టిన దర్శకుడు కథనంపై పెద్దగా దృష్టి పెట్టినట్లుగా అనిపించదు. కథలో మలుపులకు ఆస్కారం ఉన్నా.. తెరపై మలుపులతో సినిమాను నడిపించలేకపోయారు. ఈ కాలం చదువుకున్న అమ్మాయి ఫేస్ బుక్ లో ప్రేమించిన వ్యక్తి కోసం తల్లితండ్రులను
వదిలేసి వెళ్లిపోవడం అనే పాయింట్ చాలా సిల్లీగా అనిపిస్తుంది.
క్లైమాక్స్ ముగించారు.