Vishwak Sen Mechanic Rocky Movie Review:
విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మెకానిక్ రాకీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి తేజ ముల్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తరువాత విశ్వక్ సేన్ నటించిన ఈ చిత్రం మీద మంచి అంచనాలున్నాయి.
ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథ:
రాకేష్ అలియాస్ రాకీ (విశ్వక్ సేన్) తన తండ్రి గ్యారేజీలో పనిచేసే మెకానిక్. అంతేకాక, డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా పని చేస్తాడు. ఒకరోజు రియల్టర్ ద్వారా గ్యారేజ్ అమ్ముకునే అవకాశమొస్తుంది. ఈ ఒప్పందాన్ని రంకు రెడ్డి (సునీల్) ఏర్పాటు చేస్తాడు. ఈ క్రమంలో రాకీ గ్యారేజ్‌ను కాపాడుకునేందుకు ఎంతదూరమైనా వెళ్తాడు. మరోవైపు రాకీ తన ప్రియమైన ప్రియా (మీనాక్షి చౌదరి)తో ప్రేమలో ఉంటాడు. మాయా (శ్రద్ధా శ్రీనాథ్) అనే డ్రైవింగ్ నేర్చుకునే విద్యార్థితో కూడా సంబంధాలు కొనసాగిస్తాడు. ఈ మూడు కథలు ఎలా కలుసుకుంటాయి అనేది సినిమా ముఖ్యమైన అంశం.
నటీనటులు:
విశ్వక్ సేన్ తన పాత్రలో ఎనర్జీతో నటించాడు. అతని కామెడీ టైమింగ్ కొన్ని సీన్లలో నవ్విస్తుంది. మీనాక్షి చౌదరి తన హోమ్లీ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది, అయితే ఆమె పాత్రకు పూర్తిస్థాయి ప్రాధాన్యత లేదనిపిస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలో వైవిధ్యం ఉంది, కానీ రాయడంలో లోపాలు ఆమె నటనను ప్రభావితం చేశాయి. సునీల్ మరోసారి తన క్యారెక్టర్‌తో ఆకట్టుకున్నాడు.
Get Ready to witness the Massiest Entertainer ! 🔥
Mass mania started ❤️
Book your tickets for #MechanicRocky today 🍿
🔗 https://t.co/CEXgKSiDKXMaasss Trailer 2.0 💥
🔗 https://t.co/ckM5jFmvZ0#MechanicRockyInCinemas
@itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl… pic.twitter.com/fuFzZhAeMm— VishwakSen (@VishwakSenActor) November 21, 2024
టెక్నికల్ అంశాలు:
జేక్స్ బీజాయ్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మెరుగ్గా ఉంది. సినిమాటోగ్రఫీ కలర్ ఫుల్ గా ఉంది, కానీ స్క్రీన్‌ప్లే బలహీనంగా ఉండటం వల్ల ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. ఎడిటింగ్ లో కొన్ని అనవసర సన్నివేశాలను కత్తిరించి ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఓ మోస్తరు స్థాయిలో బానే ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
*విశ్వక్ సేన్ నటన
*ఇంటర్వెల్ తరువాత కొన్ని సన్నివేశాలు
*కామెడీ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
-మొదటి భాగంలో రొటీన్ కథనం
-ఇంటర్వెల్ బ్లాక్
-క్లైమాక్స్ యావరేజ్ గా ఉండడం
తీర్పు:
మెకానిక్ రాకీ కామెడీ, డ్రామా కలగలిపిన చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే, ఫస్ట్ హాఫ్ లో రొటీన్ కథనం, మరికొన్ని అనవసర సన్నివేశాలు సినిమాకి నెగెటివ్ గా చెప్పచ్చు. అయినా కూడా ఇంటర్వెల్ తరువాత కొన్ని మంచి మలుపులు సినిమాను కొంతవరకు రక్షించాయి. కథనంలో మరింత బలం ఉంటే సినిమా ఉన్న మెరుగ్గా ఉండేది చెప్పవచ్చు. సినిమాని ఒకసారి కచ్చితంగా చూసేయచ్చు.
రేటింగ్: 2.5/5
ALSO READ: Satyadev Zebra సినిమా హిట్టా ఫట్టా!