Mathu Vadalara 2 OTT release date:
క్రైమ్ కామెడీ చిత్రంగా రూపొందిన మత్తు వదలరా 2 నిన్న.. అంటే సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైంది. మంచి అంచనాలతో విడుదలైన ఈ సినిమాకి రితేష్ రానా దర్శకత్వం వహించారు. శ్రీ సింహా కోడూరి హీరోగా, సత్య, ఫరియా అబ్దుల్లా ముఖ్య పాత్రల్లో కనిపించారు.
ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మొదటి భాగంలో ఉన్న వినోదం, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే ఈ సీక్వెల్‌లో కూడా ఉన్నాయి అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కామెడీ, క్రైమ్ అంశాలను బాగా బ్యాలెన్స్ చేశారని.. ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని విమర్శకులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ సినిమా త్వరలో నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుందని తాజా సమాచారం. థియేట్రికల్ రన్ తర్వాత కొన్ని వారాల వ్యవధిలో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ సినిమా ఇతర దక్షిణాది భాషల్లో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ నుండి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
ఈ చిత్రంలో రోహిణి మోలేటి, సునీల్, వెన్నెల కిషోర్, ఝాన్సీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించగా, సంగీతాన్ని కాల భైరవ అందించారు. మొదటి భాగం అందించిన విజయాన్ని దాటి సీక్వెల్ ఇంకా పెద్ద విజయం అందుకుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా.
Read More:
అయితే ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమా ఈ రేంజ్ లో హిట్ అయింది కాబట్టి.. అంత త్వరగా అయితే డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పలేము. సినిమా డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లోకి రావడానికి.. కనీసం నెలరోజుల సమయం అయినా పడుతుంది. ఇక సినిమా డిజిటల్ రిలీజ్ కి సంబంధించిన అధికారిక విడుదల తేదీ త్వరలోనే బయటకు రానుంది.