Raa Macha Macha Song from Game Changer:
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్-ఇండియా పొలిటికల్ డ్రామా గేమ్ చేంజర్ నుంచి వచ్చిన రెండో సాంగ్ రా మచా మచా పై అందరి దృష్టి నెలకొంది. ఈ పాట ప్రమోను శనివారం విడుదల చేశారు, కాగా ఇవాళ (సెప్టెంబర్ 30 న) తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ పాటను విడుదల చేయనున్నారు.
రా మచా మచా పాట విడుదలకు ముందు, గేమ్ చేంజర్ చిత్ర బృందం ఒక వీడియోను విడుదల చేసింది. ఇందులో నిర్మాత దిల్ రాజు, ఈ పాటకు సాహిత్యం అందించిన ఆనంద్ శ్రీరామ్ పాల్గొన్నారు. వారు పాటలోని భావం, సినిమా ఇతర విషయాల గురించి చర్చించారు.
పాట వెనుక ఉన్న ఆలోచన గురించి ఆనంద్ శ్రీరామ్ వివరించారు. దర్శకుడు శంకర్, హీరో రామ్ చరణ్ తన పాత్ర స్నేహితుల పట్ల ఎంత వినమ్రంగా ఉంటాడో చూపించే విధంగా.. ఒక పాట రాయాలని చెప్పారట. మచా అన్న పదం ఇప్పుడు అంతర్జాతీయంగా మారిపోయిందని.. ఈ రోజు యువతరానికి బాగా కనెక్ట్ అవుతుందని ఆనంద్ శ్రీరామ్ పేర్కొన్నారు.
ఈ పాటను విశాఖపట్నం, అమృత్‌సర్‌లో చిత్రీకరించారు. శంకర్ తనదైన గ్రాండియర్ డైరెక్షన్, తమన్ సంగీతం పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి. రామ్ చరణ్ చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ పాటలో హైలైట్ అని అంటున్నారు.
గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వాని నటిస్తుండగా, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.
Read More: Devara సినిమా టికెట్ స్కామ్ లో ఎన్టీఆర్ హస్తం కూడా ఉందా?