
Raja Saab Shooting Update:
ప్రభాస్ నటిస్తున్న ద రాజా సాహెబ్ గురించి అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. పాన్ ఇండియా హారర్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్యే ఆయన ఈ సినిమాపై కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలవుతాయా? అని ఆతృతగా ఉన్నారు. ఇటీవల కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు మారుతి ఓపికగా సమాధానమిచ్చారు. సినిమా తీయడమంటే చిన్న విషయం కాదు… చాలా స్టెప్స్ ఉంటాయని చెప్పారు.
ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని… టాకీ పార్ట్, పాటలు కొద్దిగా మాత్రమే మిగిలిపోయాయని మారుతి చెప్పారు. ఇకపోతే సినిమాకు కావలసిన గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండటంతో కొన్ని స్టూడియోల వర్క్ ఇంకా పెండింగ్‌లో ఉందట. అదే ప్రధాన కారణంగా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఆలస్యం అవుతోందని ఆయన చెప్పకనే చెప్పారు.
పాటల విషయంలో మాత్రం మారుతి ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్ చెప్పారు. మిగిలిన పాటలు అభిమానులను ఖచ్చితంగా అలరిస్తాయని గ్యారంటీ ఇచ్చారు. ఇకమొత్తానికి మూవీకి సంబంధించిన క్లారిటీ త్వరలో రానుందన్న ఆశతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రంలో మలవిక మోహనన్ ప్రధాన హీరోయిన్‌గా నటిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంజయ్ దత్ ఓ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
ALSO READ: Pawan Kalyan Son: అర్థరాత్రి సింగపూర్ బయలుదేరిన చిరంజీవి, సురేఖ…మార్క్ శంకర్ కోసం..!