HomeTelugu Trendingమార్టిన్‌ లూథర్‌ కింగ్‌: కింగ్‌ కింగ్‌ సాంగ్‌ అప్డేట్‌

మార్టిన్‌ లూథర్‌ కింగ్‌: కింగ్‌ కింగ్‌ సాంగ్‌ అప్డేట్‌

martin luther new song upda

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్‌ ‘. తమిళ నటుడు యోగిబాబు న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ మండేలా చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాను త‌మిళంలో మహావీరుడు ఫేమ్ మడోన్నా అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. తెలుగులో ఈ సినిమాకు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తుంది.

దర్శకురాలిగా ఆమెకు తొలి సినిమా ఇది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి విప‌రీత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేక‌ర్స్ సెకండ్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు.

మార్టిన్ లూథర్ కింగ్ నుంచి ‘కింగ్ కింగ్’ అనే పాట‌ను మేక‌ర్స్ ఈరోజు సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేకర్స్ తెలిపారు. నరేష్, వెంకటేష్ మహా, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ తదితరులు ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్రలు పోషిస్తున్నారు.

వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu