ఎన్టీఆర్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో గతంలో ‘దమ్ము’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాలో
యాక్షన్ పార్ట్ ఎక్కువ కావడంతో బాక్సాఫీస్ వద్ద కాస్త తడబడింది. అయితే ఇప్పుడు మరోసారి
ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందనే మాటలు వినిపిస్తున్నాయి. జనతాగ్యారేజ్ వంటి హిట్
సినిమా తరువాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేయాలని ఆలోచిస్తున్న సమయంలో బోయపాటి
నుండి పిలుపు వచ్చిందట. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథ గురించి డిస్కషన్స్ జరిగినట్లు
సమాచారం. నిజానికి బోయపాటి ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయాల్సివుంది.
ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరి ఎన్టీఆర్ ఈ సినిమా పూర్తయ్యే
వరకు బోయపాటి కోసం ఎదురు చూస్తాడో.. లేక మరో డైరెక్టర్ తో ట్రావెల్ చేస్తాడో.. చూడాలి!