Marco OTT release date:
ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మార్కో’ సినిమా డిసెంబర్ 20న విడుదలై భారీ విజయం సాధించింది. ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరిన 9వ మలయాళ సినిమాగా గుర్తింపు పొందింది. ఇంకా హిందీ డబ్బింగ్ వెర్షన్‌లో అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన 2024 టాప్ మలయాళ మూవీగా నిలిచింది.
ఇతర భాషల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా ఎక్కువగా నెగటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాలో బ్లడ్, గోర్, వైలెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని విమర్శలు వచ్చాయి.
సోషల్ మీడియాలో మార్కో గురించి చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.
ఒకరు “మార్కో సినిమా కేవలం స్టైల్ మాత్రమే! కానీ కథలో కొత్తదనం లేదు. బ్లడ్ కథని కూడా కప్పేసింది” అని విశ్లేషించారు. మరో యూజర్ “అధిక బ్లడ్, స్లో మోషన్ సీన్స్‌తో స్టోరీ మర్చిపోయారు. 1.5/5 రేటింగ్” అని కామెంట్ చేశారు.
Netflix acquired digital rights of India’s most violence movie #MARCO.
Streaming date announce on January. pic.twitter.com/fFjdByEs9K
— Ott Updates (@Ott_updates) December 30, 2024
అంతేకాకుండా, ఉన్ని ముకుందన్ BJPలో ఉండటం వల్ల కొన్ని రాజకీయ పార్టీలు బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను బూస్ట్ చేస్తున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలా ఉంటే, మార్కో త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ, ఈ వార్తల్లో నిజం లేదని తాజా సమాచారం చెబుతోంది.
ఓటిటి వర్షన్ గురించి ఇంకా క్లారిటీ లేదు. మేకర్స్ నుంచి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఓటిటి వెర్షన్‌లో డిలీటెడ్ సీన్స్, ఎక్స్టెండెడ్ రన్‌టైమ్ ఉంటాయని మాత్రం తెలుస్తోంది.