సీని పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్యంతో కొందరు మరణిస్తుంటే.. మరికొందరు ఒత్తిడిని జయించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్య ఘటన మరవకముందే.. మరాఠీ చిత్ర పరిశ్రమలో మరో నటుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మరాఠీ నటుడు అశుతోష్ భక్రే ఉరివేసుకొని ప్రాణాలు తీసున్నాడు. బుధవారం సాయంత్రం మహారాష్ట్రలోని నాందెడ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నాందెడ్లోని గణేష్ నగర్ ప్రాంతంలో ఇంట్లోనే
ఉరివేసుకున్నాడు అశుతోష్ భక్రే.
అశుతోష్ భక్రే.. భకార్, ఇచర్ థార్లా పక్కా వంటి పలు సినిమాల్లో నటించాడు. ఆయన భార్య కూడా సినీ పరిశ్రమకు చెందిన వారే. భక్రే భార్య మయూరి దేశ్ ముఖ్ పలు మరాఠీ సినిమాల్లో హీరోయిన్గా నటించారు. ఐతే అశుతోష్ భక్రే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది తెలియాల్సి ఉంది. నెల రోజుల క్రితమే అతడు నాందెడ్కు వెళ్లి అక్కడే
ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని.. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని సన్నిహితులు భావిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.