ప్రముఖ హీరో మోహన్ లాల్ మలయాళంలో ‘మరక్కర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కేరళ తీరప్రాంతాన్ని ఆక్రమించడానికి పోర్చుగీసువారు ప్రయత్నించినప్పుడు వారిని ఎదిరించిన ‘కుంజలి మరక్కర్’ అనే యోధుడి కథ ఇది. 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఆంటోని పెరంబవూర్ ఈ సినిమాను నిర్మించారు. ప్రియదర్శన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ సినిమాను క్రితం ఏడాదిలోనే విడుదల చేయాలనుకున్నారు. కాగా కరోనా కారణంగా వాయిదా పడింది.
ఈ సినిమాను ‘ఓనమ్’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఆగస్టు 12వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీ తో కూడిన పోస్టర్ ను కూడా వదిలారు. సునీల్ శెట్టి .. యాక్షన్ కింగ్ అర్జున్ .. ప్రభు .. కీలకమైన పాత్రలను పోషించారు. ఇక ముఖ్యమైన పాత్రల్లో కీర్తి సురేశ్, మంజు వారియర్, సుహాసిని, కల్యాణి ప్రియదర్శన్ కనిపించనున్నారు. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ కూడా ఈ సినిమాలో నటించడం విశేషం. ఈ సినిమా సృష్టించనున్న సంచలనం గురించే మోహన్ లాల్ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
സ്നേഹത്തോടെ, നിറഞ്ഞ മനസ്സോടെ പ്രതീക്ഷിക്കുകയാണ്, ഈ വരുന്ന ഓഗസ്റ്റ് 12ന്, ഓണം റിലീസ് ആയി “മരക്കാർ അറബിക്കടലിന്റെ സിംഹം” നിങ്ങളുടെ മുന്നിലെത്തിക്കാൻ ഞങ്ങൾക്ക് കഴിയുമെന്ന്.. അതിനു നിങ്ങളുടെ പ്രാർഥനയും പിന്തുണയും ഉണ്ടാകുമെന്ന വിശ്വാസത്തോടെ ഞങ്ങൾ മുന്നോട്ട് നീങ്ങുന്നു.. pic.twitter.com/pPhADwoG0q
— Mohanlal (@Mohanlal) June 18, 2021