Manushi Chillar: మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్లో
వరుస సినిమాలు చేస్తుంది.
తాజాగా మానుషి.. ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్‌ను
తాను ఎంతగానో అభిమానిస్తున్నట్లు చెప్పారు. రామ్ చరణ్ అంటే నాకెంతో ఇష్టం. డ్యాన్స్ అద్భుతంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నా తదుపరి తెలుగు చిత్రం ఆయనతోనే ఉండాలని కోరుకుంటున్నా అని అన్నారు.
తాజాగా ఆమె బాలీవుడ్లో ‘బడే మియాన్ చోటే మియాన్’ సినిమాలో నటించారు. వయసులో తనకంటే 30 ఏళ్లు పెద్దవాడైన అక్షయ్ కుమార్‌తో నటించడం పట్ల ఆమె స్పందించారు. ఈ విషయంపై ప్రతి ఒక్కరికీ విభిన్న అభిప్రాయాలున్నాయి. వయసులో పెద్దవారైన పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే, స్టార్స్‌తో స్ర్కీన్ షేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించవచ్చు.
అక్షయ్ కుమార్ సూపర్‌స్టార్. ఆయనతో వర్క్ చేయడాన్ని నేనెంతగానో ఎంజాయ్ చేశా. ఎంతోమంది ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటారు. కొంతమందికి మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది. తమ చిత్రాల్లోకి నటీనటులుగా ఎవరిని తీసుకోవాలనేది పూర్తిగా దర్శకుల నిర్ణయం. కాబట్టి దాని గురించి నేను పెద్దగా మాట్లాడుకోవడం లేదు.
స్టార్ హీరోలతోనే కాకుండా యువ హీరోల చిత్రాల్లోనూ నటించాలనుకుంటున్నా.. నా నటనను సవాలు చేసే పాత్రల కోసం వెయిట్ చేస్తున్న పాత్రల కోసం వెయిట్ చేస్తున్నానని అన్నారు. యానిమల్ సినిమాపై కూడా ఈ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘డైరెక్టర్ సందీప్ రెడ్డి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన ప్రాజెక్టులలో నటించాలని ఉంది.
ఇటీవల యానిమల్ సినిమాను చూశా. అందులో రష్మిక పోషించిన గీతాంజలి పాత్ర నాకు చాలా నటించింది. కుటుంబంలో కలతలు వచ్చినప్పుడు తను చాలా ధైర్యంగా నిలబడింది. అందులో రష్మిక నటన అద్భుతం. నటిగా నన్ను సవాలు చేసే అలాంటి పాత్రలు చేయాలని ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.
అలాగై అర్జున్ రెడ్డి రీమేక్ గా హిందీలో తెరకెక్కిన కబీర్ సింగ్ పాత్ర కోసం చిత్రయూనిట్ ముందు తననే సంప్రదించిందని.. కానీ షాహిద్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని తెలియక రిజెక్ట్ చేసినట్లు తెలిపారు. అదే సమయంలో తాను మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుపొందినట్లు తెలిపింది. ఆ కారణంగానే కబీర్ సింగ్ సినిమా చేయలేకపోయినట్లు తెలిపారు.