టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన సినిమా ‘మన్మథుడు 2’. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని తొలి పాట విడుదలైంది. ‘హే మెనీనా.. ఐ సీయూ వాన్న లవ్’ అంటూ సాగే ఈ పాటలో నాగ్ చాలా స్టైలిష్‌గా, ఓ ఆంగ్ల భామతో ప్రేమలో ఉన్నట్లుగా చూపించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత, కీర్తి సురేశ్ కీలక పాత్రలు పోషించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఆగస్ట్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.