HomeTelugu Trendingఫ్రెంచ్ ఫిల్మ్ ఆధారంగా మన్మధుడు-2

ఫ్రెంచ్ ఫిల్మ్ ఆధారంగా మన్మధుడు-2

10 23
అక్కినేని నాగార్జున, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా మ‌న్మ‌థుడు-2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. మన్మధుడిగా నాగార్జున ఈ చిత్రంలో తన రొమాంటిక్ విశ్వరూపం చూపించబోతున్నాడు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో లిప్ లాక్ సీన్లలో మునిగిపోయాడు.

10b 1

మన్మధుడు-2 మూవీ కథను కాపీకొట్టారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నాగార్జున దీనిపై క్లారిటీ ఇచ్చారు. ట్రైలర్‌ లాంచ్ కార్యక్రమంలో మాట్లాడుతూ గతంలో ఊపిరి’ అనే సినిమా అన్ టచబుల్ అనే ఫ్రెంచ్ ఫిల్మ్ ఆధారంగా తీశాం. రైట్స్ కొనుక్కున్నాం. మన్మధుడు 2 సినిమా స్క్రిప్ట్ కూడా కేవా మూవీస్ నుంచి గీత నాకు ఈ స్క్రిప్ట్ తీసుకొచ్చింది. ఇది ఫ్రెంచ్ ఫిల్మ్ తీసుకొచ్చి చూపించింది. ఇది మీరు చేస్తే బావుంటుంది అన్నారు. నాకు నచ్చింది. సినిమా చేయడానికి ముందే స్టూడియో కెనాల్‌కి లెటర్ పంపాం. మాకు మీ సినిమా నచ్చింది. ఎంతకు ఇస్తారు రైట్స్ అని అడిగాం. వారు ఒప్పుకున్న తర్వాతే కథ మీద చర్చలు మొదలయ్యాయి.

ఈ చిత్రాన్ని రాహుల్ రవీంద్రన్ బ్రహ్మాండంగా రూపొందించాడని తెలిపారు. మన్మధుడు చిత్రానికి ఇది సీక్వెల్ కాదు. ఆ చిత్రంతో మన్మధుడు-2కి ఎలాంటి సంబంధం లేదు.. దానిలో ఉండే క్యారెక్టర్స్ ఏమీ దీనిలో ఉండవని నాగార్జున తెలిపారు. అందులో లీడ్‌ రోల్‌ నేనే చేశాను. ఇందులో కూడా నేనే లీడ్ రోల్ చేస్తున్నాను అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu