HomeTelugu Big Storiesమణిరత్నం 'నవరస' ట్రైలర్‌

మణిరత్నం ‘నవరస’ ట్రైలర్‌

Maniratnam navarasa web s
స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం భారీ తారాగణంతో నిర్మిస్తోన్న వెబ్‌ సిరీస్‌ ‘నవరస’. శాంతం, కరుణ, రౌద్రం, భయానకం.. ఇలా నవరసాల నేపథ్యంలో తొమ్మిది భాగాలుగా ఈ సిరీస్‌ రానుంది. ఒక్కో భాగాన్ని ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. సూర్య, సిద్ధార్థ్‌, ప్రకాశ్‌రాజ్‌, విజయ్‌ సేతుపతి, రేవతి, ఐశ్వర్యరాజేశ్‌, అరవింద్‌ స్వామి, రోబో శంకర్‌, యోగిబాబు, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 6 నుంచి ప్రముఖ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. టైటిల్‌కి తగ్గట్టుగానే అన్ని రకాల భావోద్వేగాలతో ఆద్యంతంగా ఆసక్తిగా సాగింది. ప్రతీ నటుడు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అందరి లుక్స్‌ చాలా కొత్తగా ఉన్నాయి. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. స్టార్‌ నటుడులకు అందర్ని ఒకే వీడియోలో చూస్తుండటం కొత్త అనుభూతిని పంచుతోంది.

ఈ సిరీస్‌ని మరో దర్శకుడు జయేంద్రతో కలిసి నిర్మిస్తున్నారు మణిరత్నం. తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన సినీ కార్మికులని ఆదుకోవడమే లక్ష్యంగా ఈ సిరీస్‌ రూపుదిద్దుకుంది. రతీంద్రన్‌ ఆర్‌. ప్రసాద్‌, అరవింద్‌ స్వామి, బిజోయ్‌ నంబియార్‌, గౌతమ్‌ వాసుదేవ మేనన్‌, సర్జున్‌ కె.ఎం, ప్రియదర్శన్‌, కార్తీక్‌ నరేన్‌, కార్తీక్‌ సుబ్బరాజ్‌, వసంత్‌ ఈ తొమ్మిది కథలకి దర్శకత్వం వహించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu