HomeTelugu Trendingమంగ్లీని సలహాదారుగా నియమించిన ఏపీ ప్రభుత్వం

మంగ్లీని సలహాదారుగా నియమించిన ఏపీ ప్రభుత్వం

Mangli as svbc channel advi

ఏపీ ప్రభుత్వం.. టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా సింగర్‌ మంగ్లీని నియమించింది. రెండేళ్ల పాటు ఈ పదవిలో ఆమె ఉంటారు. ఈ పదవిని నిర్వహిస్తున్నందుకు ఆమెకు నెలకు రూ. లక్ష వేతనం అందుతుంది.

మరోవైపు ఆమెను ఎస్వీబీసీ సలహాదారుగా నియమిస్తూ ఈ ఏడాది మార్చిలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే నాలుగు రోజుల క్రితం ఆమె బాధ్యతలను చేపట్టినట్టు సమాచారం. కాస్త ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక న్యూస్ ఛానల్ లో కెరీర్ ను ప్రారంభించిన మంగ్లీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. 2020లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాన్ని అందుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu