అజయ్ భూపతి డైరెక్టర్ లో వస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం’. ఈ సినిమాలో అజయ్ భూపతి మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రథమార్దం సో సోగా అనిపిస్తుంది. కాకపోతే గ్రిప్పింగ్‌గానే ముందుకు సాగుతుంది. అన్ని సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లో చూపించినట్టుగానే చూపించినట్టుగా కనిపిస్తుంది. ఇక సెకండాఫ్ ప్రారంభం కాస్త నెమ్మదిగా, నీరసంగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పీక్స్‌కు చేరుతుంది. అవే ఈ చిత్రానికి బలం. పాటలు పర్వలేదు. మాటలు కొన్ని చోట్ల గుండెల్ని తాకుతాయి. నిర్మాణ విలువలు మెప్పిస్తాయి. ఈ సినిమా సీక్వెల్స్‌తో అజయ్ భూపతి రెడీగా ఉన్నాడు. స్పెషల్ ఎంట్రీ, కారెక్టర్ అందరికీ సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది.
మహాలక్ష్మీపురం అనే గ్రామంలో ఈ కథ జరుగుతుంది. కథ అంతా కూడా 80, 90ల నేపథ్యంలోనే ఉంటుంది. ఆ ఊర్లో రవి, శైలు (పాయల్ రాజ్‌పుత్)లు బాల్య స్నేహితులు. అయితే రవి చిన్నతనంలో ఓ అగ్రి ప్రమాదంలో మరణిస్తాడని అనుకుంటుంది శైలు. కొన్నేళ్ల తరువాత ఆ ఊర్లో ప్రతీ మంగళవారం కొన్ని చావులు సంభవిస్తుంటాయి. అక్రమ సంబంధాలు ఉన్న వ్యక్తుల పేర్లు ఊర్లోని గోడ మీద రాసి ఉంటుంది. ఆ తెల్లారే ఆ ఇద్దరూ చనిపోయి కనిపిస్తుంటారు. అలా ఆ గోడల మీద రాసేది ఎవరు? చంపేది? ఎవరు అని ఊరంతా చర్చించుకుంటుంది. కొత్తగా వచ్చిన ఎస్సై మాయా (నందితా శ్వేత) మీద ఊరి జనాలు అనుమానపడతారు.
ఎస్సై మాయ ఏమో ఊర్లోని కొంత మంది వ్యక్తుల మీద అనుమానం వ్యక్తం చేస్తుంది. ఊరి పెద్ద జమిందారు ప్రకాశం బాబు (చైతన్య కృష్ణ), వాసు (శ్రవణ్ రెడ్డి), కసిరాజు (అజయ్ ఘోష్), గురజ (శ్రీ తేజ్), ఆర్ఎంపీ విశ్వనాథం (రవీంద్ర విజయ్)లాంటి కొంత మంది మీద అనుమానం వ్యక్తం చేస్తుంటుంది. అసలు ఈ చావులన్నంటి వెనకాలు ఉన్న కథ ఏంటి? శైలు జీవితంలోకి వచ్చిన మధన్ (అజ్మల్ అమీర్) వ్యవహారం ఏంటి? శైలుని ఊరి జనాలు ఏం చేశారు? శైలుకి ఉన్న సమస్య ఏంటి? చివరకు ఊరి పెద్ద జమీందారు ఏం చేశాడు? జమీందారు భార్య రాజేశ్వరీ దేవి పాత్ర ఏంటి? అన్నది థియేటర్లో చూడాల్సిందే.
పాత కథ అయిన దర్శకుడు ప్రజెంట్ చేసిన తీరు బాగుంది, ఊర్లోని రకరకాల మనస్తత్వాలున్న మనుషులు.. ఊర్లో వరుసగా చావులు.. అందరి మీద అనుమానం వచ్చేలా స్క్రీన్ ప్లేను రాసుకోవడం, చివరకు మంచిగా కనిపించే వ్యక్తులు, మంచిగా చూపించే వ్యక్తులే వాటన్నంటికి కారణం అని క్లైమాక్స్‌లో చూపిస్తారు. అజయ్ భూపతి చేసింది కూడా అదే అనిపిస్తుంది. తెరపై ఓ పాత్ర బాధపడుతుంటే.. చూసే ఆడియెన్స్ సైతం బాధపడాలి. అప్పుడే సినిమాకు జనాలు కనెక్ట్ అయినట్టు లెక్క.
బోల్ట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ పాత్ర ఈ సినిమాకి హైలైట్. ఈ చిత్రంలో ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. శ్రీతేజ్, అజ్మిల్, శ్రావణ్ రెడ్డి,అజయ్ ఘోష్, చైతన్య కృష్ణ, దివ్యా పిళ్లై, రవీంద్ర విజయ్ ఇలా ప్రతీ ఒక్క పాత్ర బాగుంటుంది. అన్ని కారెక్టర్లను అజయ్ భూపతి చక్కగా రాసుకున్నాడు.