నటి కరాటే కళ్యాణి వివాదంలో చిక్కుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 28న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు. ఈ సందర్భంగా.. ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటిని ఎన్టీఆర్ అభిమానులు, ప్రేక్షకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల పొడవైన శ్రీకృష్ణుని రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సన్నాహాలు చేశారు. ఈ విగ్రహావిష్కరణకు ఆయన జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి ఆహ్వానం కూడా అందించారు. అయితే తర్వాతే అసలు గొడవ స్టార్ట్ అయ్యింది.
శ్రీకృష్ణుడు రూపంలోని ఎన్టీఆర్ విగ్రహావిష్కణకు నటి కరాటే కళ్యాణి తప్పు పట్టింది. తీవ్రస్థాయిలో ఆమె యాదవ సంఘాలు, కొన్ని హిందూ సంఘాలతో కలిసి పోరాటం చేస్తోంది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను అడ్డుకుంటామని ఆమె చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు అనుకోని షాక్ తగిలిందనే చెప్పాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కళ్యాణికి వార్నింగ్ కాల్ వెళ్లిందని అంటున్నారు. అది కూడా స్వయంగా విష్ణు మంచు చేశారట. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు అడ్డుపడొద్దనేది సదరు వార్నింగ్ ఫోన్ కాల్ సారాంశం. అయితే దీనిపై కరాటే కళ్యాణిని స్పందించారు.
‘నాకు మా అసోసియేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చిన మాట నిజమే. అయితే అదేం బెదిరింపు కాల్ కాదు. ఫోన్ చేసి సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్‌గారు ఓ దేవుడులాంటి వ్యక్తి. ఆయన విగ్రహావిష్కరణకు అడ్డుపడటం కరెక్ట్ కాదని అన్నారు. అయితే నేను ఏం చెప్పానంటే నాకూ ఎన్టీఆర్‌గారంటే గౌరవం, భక్తి ఉన్నాయి. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తే నాకేం సమస్య లేదు. కానీ శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించటాన్ని తప్పు పడుతున్నానని చెప్పాను. నా స్టాండ్ వారు అర్థం చేసుకున్నప్పటికీ మా రూల్స్ ప్రకారం క్రమశిక్షణా సంఘం చర్యలు ఉంటాయని, షోకాజ్ నోటీసులు వస్తాయని అన్నారు. నా నుంచి వివరణ కోరుతారని, దానికి నేను బదులు ఇచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పారు’ అని తెలిపారు కరాటే కళ్యాణి.
ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు