HomeTelugu Trendingప్రకాశ్‌ రాజ్‌ రాజీనామపై మనోజ్‌ స్పందన

ప్రకాశ్‌ రాజ్‌ రాజీనామపై మనోజ్‌ స్పందన

Manchu vishnu respond praka

‘మా’ ఎన్నికలు నిన్న ఉత్కంఠభరితంగా ముగిసిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందారు. విష్ణుకి వ్యక్తిరేకంగా పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ‘మా’ సభ్యులు ప్రాంతీయత కారణంగా తెలుగు వాళ్లే అధ్యక్షుడు అవ్వాలని నిర్ణయించారని, వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని, కానీ తనకు ఆత్మ గౌరవం ఉందని, ఇకపై మా అసోసియేషన్ లో మెంబర్ గా ఉండబోనని, ఇది నొప్పితో తీసుకున్న నిర్ణయం కాదని వెల్లడించారు. తన నిర్ణయానికి కట్టుబడి ఉంటూ కొత్తగా అధ్యక్షులైన మంచు విష్ణుకు ప్రకాష్ రాజ్ రాజీనామా విషయమై పర్సనల్ గా మెసేజ్ చేశారు. మంచు విష్ణుకి ఆల్ ది బెస్ట్ చెబుతూ ‘మా’ మెంబర్షిప్ కు రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నానని, తమ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయాలని, భవిష్యత్తులో తన నుంచి ఇలాంటి సపోర్ట్ కావాలన్నా ఇస్తాను అంటూ తన రిజైన్ ను యాక్సెప్ట్ చేయాలంటూ రిక్వెస్ట్ చేశారు.

ఆ మెసేజ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను షేర్ చేసుకున్న మంచు విష్ణు ప్రకాష్ రాజ్ రాజీనామాపై స్పందించారు. “మీ నిర్ణయం నాకు ఏమాత్రం సంతోషకరం కాదు. సక్సెస్ లు, ఫెయిల్యూర్ లు సహజం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. మీరు మా కుటుంబంలో మెంబర్. మీ సలహాలు, సూచనలు ‘మా’కు అవసరం. మనం కలిసి చర్చించుకుందాం. అంతవరకూ తొందరపడకండి” అంటూ ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు రిప్లై ఇవ్వడం ఆ మేసేజ్ లో కన్పిస్తోంది.’ భవిష్యత్తు కోసం మేమంతా ఒక్కటే’ అంటూ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు మంచు విష్ణు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu