హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించేది లేదని హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించారు. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సన్మాన కార్యక్రమంలో మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు నటుల పట్ల దారుణంగా ప్రవరిస్తున్నాయని, అసభ్యకరంగా వ్యవహరించే అలాంటి ఛానళ్లపై చర్యలు తప్పవన్నారు. యూట్యూబ్ ఛానళ్ల థంబ్‌నైల్స్ హద్దులు మీరుతున్నాయని మండిపడ్డారు.
నటీమణులు మన ఆడపడుచలని, వారిని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించమన్నారు. యూట్యూబ్ ఛానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పరిధి దాటే ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లని నియంత్రిండం తన ఎజెండాలో ఓ అంశమని పేర్కొన్నారు. తెలుగు మీడియా ఎప్పుడూ హద్దులు దాటలేదని, తన కుటుంబానికి, చిత్ర పరిశ్రమకి సహకారం అందిస్తూనే ఉందని చెప్పారు.