HomeTelugu Big Storiesసినీరంగంలో.. మంచు విష్ణు కూతుళ్లు ఎంట్రీ.. వైరల్‌

సినీరంగంలో.. మంచు విష్ణు కూతుళ్లు ఎంట్రీ.. వైరల్‌

Manchu vishnu daughters sun
మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘జిన్నా’. సన్నీలియోన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇషాన్‌ సూర్య డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు విష్ణు. ఈ మూవీతో తన కూతుళ్లు సినీరంగంలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ లేఖ విడుదల చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది.

‘నేను ఈ సినీపరిశ్రమలోనే పుట్టాను, సినిమా సెట్స్‌లోనే పెరిగాను. ఎప్పుడూ నేను నటుడ్ని అవ్వాలనే కోరుకున్నాను, అనుకున్నది సాధించాను. ఒక నటుడి ప్రయాణం కనిపించినంత గ్లామర్‌గా ఉండదు. కానీ ఒక నటుడిగా నేను మీ నుంచి పొందే ప్రేమాభిమానాల ముందు ఈ సవాళ్లతో కూడిన ప్రయాణం కష్టమనిపించదు. ప్రతి తెలుగువాడు నా కుటుంబ సభ్యుడు. నేను ఎప్పుడూ వారికి దూరంగా లేను. ఆ కారణం చేతనే నాకు పిల్లలు పుట్టినప్పుడు మీ బ్లెస్సింగ్స్‌ కోసం వాళ్లను మీ ముందుకు తీసుకువచ్చాను.

ఒక తండ్రిగా, నటుడిగా నా కూతురులైన అరియాన, వివియానలను గాయనీమణులుగా, నటీమణులుగా మీ ముందుకు తీసుకువస్తున్నాను. జిన్నాలో మన అరియాన, వివియాన కలిసి ఓ పాట పాడారు. దీనికి సంబంధించిన వీడియో సాంగ్‌ ఈ నెల 24 ఆదివారం ఉదయం 11.13 నిమిషాలకు విడుదలకానుంది. వాళ్లు నటీమణులు అవ్వాలనేది నా కల. కానీ వారు ఏమార్గం ఎంచుకుంటారనేది పూర్తిగా వాళ్ల ఇష్టం’ అని రాసుకొచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu