మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలపై గత కొన్ని నెలల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి. ఈఏడాది ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్‌ని ప్రకటించగా… ఈరోజు (గురువారం) ఉదయం మంచు విష్ణు తన ప్యానల్‌ని ప్రకటించారు. తన ప్యానల్ నుంచి ఎవరెవరు.. ఏ ఏ పదవుల కోసం పోటీ చేస్తున్నారు.. అనే విషయాలను ఆయన వెల్లడించారు.
మంచు విష్ణు ప్యానల్
*మంచు విష్ణు – అధ్యక్షుడు
*రఘుబాబు – జనరల్ సెక్రటరీ
*బాబు మోహన్ – ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్
*మధాల రవి – వైస్ ప్రెసిడెంట్
*పృథ్వీరాజ్ బాలిరెడ్డి – వైస్ ప్రెసిడెంట్
*శివబాలాజీ – కోశాధికారి
*కరాటే కల్యాణి -జాయింట్ సెక్రటరీ
*గౌతమ్ రాజు-జాయింట్ సెక్రటరీ
*అర్చన
*అశోక్‌కుమార్
*గీతాసింగ్
*హరినాథ్‌బాబు
*జయవాణి
*మలక్‌పేట్ శైలజ
*మాణిక్
*పూజిత
*రాజేశ్వరీ రెడ్డి
*సంపూర్ణేశ్ బాబు
*శశాంక్
*శివన్నారాయణ
*శ్రీలక్ష్మి
*శ్రీనివాసులు
*స్వప్నా మాధురి
*విష్ణు బొప్పన
*వడ్లపట్ల
For my MAA, our privilege and honor 🙏 pic.twitter.com/Ow3Cdrvsec
— Vishnu Manchu (@iVishnuManchu) September 23, 2021