మంచు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయి అని గతకొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ లకు పడటం లేదని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మంచు మనోజ్, భూమా మౌనికల వివాహానికి కూడా మంచు విష్ణు ఏదో గెస్టులా వచ్చి వెళ్లిపోయారు. ఇప్పుడు వీరి కుటుంబ విభేదాలు రచ్చకెక్కాయి. తాజాగా మంచు విష్ణుకు సంబంధించిన ఓ వీడియోను మనోజ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి కలకలం రేపారు. ఇలా ఇళ్లలోకి దూరి మా వాళ్లను, బంధువులను కొడుతుంటాడండీ… ఇదీ సిచ్యువేషన్ అని మనోజ్ అన్నారు.
మరోవైపు ఈ అంశంపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాకు ఎందుకు ఎక్కారని ప్రశ్నించినట్టు సమాచారం. తన తండ్రి ఆదేశాలతో మనోజ్ వీడియోను డిలీట్ చేశారు. ఓ వీడియో ఛానల్ తో మోహన్ బాబు మాట్లాడుతూ… అన్నదమ్ముల మధ్య చిన్నచిన్న గొడవలు జరగడం సహజమేనని చెప్పారు. ఆవేశం అన్ని విధాలా అనర్థమేనని అన్నారు. ఇద్దరి మధ్య సర్ది చెప్పేందుకు యత్నిస్తున్నానని తెలిపారు.
ఇంకోవైపు ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని మనోజ్ భావిస్తున్నట్టు సమాచారం. కాసేపటి క్రితం మంచు లక్ష్మి తన నివాసం నుంచి కారులో బయల్దేరారు. ఆమె ఎక్కడకు బయల్దేరారనే విషయంలో క్లారిటీ లేదు. నిన్న రాత్రి ఈ గొడవ జరిగినట్టు భావిస్తున్నారు. మనోజ్ సహాయకుడు సారథి అనే వ్యక్తిపై విష్ణు దాడి చేసినట్టు చెపుతున్నారు. ఆ సమయంలో సారధి ఇంట్లో మనోజ్, మంచు లక్ష్మి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియోను తీసింది కూడా మనోజే తెలుస్తుంది.
ఇటీవలే మంచు మనోజ్ భూమ మౌనిక రెడ్డి రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మొత్తం పెళ్లి బాధ్యతలను మనోజ్ అక్క మంచు లక్ష్మి దగ్గరుండి చూసుకుంది. అయితే ఈ వేడుకల్లో మనోజ్ సోదరుడు మంచు విష్ణు ఎక్కువ సమయం గడపలేదు. ఏదో వచ్చామా.. వెళ్లామా.. అన్నట్టు వ్యవహరించాడు. అయితే ‘మా’ ఎన్నికల నాటి నుంచి అన్నదమ్ముల మధ్య వివాదాలు నడుస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు