టాలీవుడ్ సీనియర్ నటుడు కలక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’. ఈ మూవీతో రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. విశేషం ఏమంటే… నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో మోహన్ బాబు వైవిధ్యమైన పాత్రలు ఎన్నో చేశాడు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘీక పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించాడు. అలాంటి మోహన్ బాబుకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘శాకుంతలం’ చిత్రంలో దుర్వాస మహర్షి పాత్ర దక్కిందనే ప్రచారం జరుగుతోంది. శకుంతలగా సమంత, దుష్యంతునిగా దేవ్ మోహన్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా సోమవారం మొదలైంది.
అతి త్వరలో మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతుంది. దీంతో దర్శక నిర్మాతలు ఇతర పాత్రధారుల ఎంపికలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే మోహన్ బాబును దుర్వాస ముని పాత్ర కోసం అడిగారన్నది సమాచారం. గతంలో యముడుతో సహా పలు పౌరాణిక పాత్రలను మోహన్ బాబు చేసి మెప్పించారు. పైగా అత్యంత కోపిష్టి వాడైన దుర్వాసుని పాత్రకు మోహన్ బాబు అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని యూనిట్ లోని మెజారిటీ సభ్యులు వ్యక్తం చేశారట. చూడాలి మరి ఓ జరుగుతుందో.