HomeTelugu Trendingమోహన్‌ బాబు కీలక ప్రకటన

మోహన్‌ బాబు కీలక ప్రకటన

Manchu mohan babu announced
మంచు మోహన్ బాబు విలన్‌ కేవలం నటుడుగానే కాకుండా తిరుపతిలో ప్రసిద్ధ శ్రీ విద్యా నికేతన్‌ను అనే విద్యాసంస్థ స్థాపించి కులమతాలకు అతీతంగా విద్య అందిస్తున్నారు. తాజాగా మంచు మోహన్‌ బాబు మరో కీలక ప్రకటన చేశారు. ‘మోహన్ బాబు యూనివర్సిటీ’ ప్రారంభిస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు.

‘శ్రీ విద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్పవృక్షంగా మారాయి. మీ 30 సంవత్సరాల విశ్వాసం, నా జీవిత లక్ష్యం ఇప్పుడు వినూత్న అభ్యాస విశ్వంలోకి చేరుకుంది. కృతజ్ఞతతో తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీని మీకు అందిస్తున్నాను. మీ ప్రేమే నా బలం, మీరు కూడా ఈ కలకి మద్దతు ఇస్తారని నేను విశ్వసిస్తున్నాను’ అని మోహన్‌ బాబు ట్వీట్‌ చేశారు.

1993లో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఫార్మసీ, పీజీ కాలేజ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ‘మోహన్ బాబు యూనివర్సిటీ’ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu