HomeTelugu TrendingManchu Manoj: మౌనిక శ్రీమంతం.. కనిపించని మంచు ఫ్యామిలీ!

Manchu Manoj: మౌనిక శ్రీమంతం.. కనిపించని మంచు ఫ్యామిలీ!

Manchu manoj wife mounika s

మంచు మనోజ్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెల్సిందే. గతేడాది.. భూమా మౌనిక రెడ్డి- మనోజ్ ప్రేమించి చేసుకున్నారు. వీరిద్దరికి అంతకుముందే వేరేవారితో పెళ్లి అయ్యింది. భూమా మౌనికకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకును కూడా మనోజ్ అంగీకరించాడు. ఆ చిన్నారి బాలుడును శివుడు తనకు బహుమతిగా ఇచ్చాడని మనోజ్ భావిస్తాడు.

ఇటీవలే ఆ బాబు బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు మనోజ్‌. ఇక మౌనిక తల్లి కాబోతుందని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి వీరికి సంబంధించిన ఎదో ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతునే ఉంది. ఇటీవలేవీరికి కవలలు అని వస్తున్న వార్తలను కూడా వారు ఖండించారు కూడా.

ఇకపోతే తాజాగా భూమా మౌనిక సీమంతం ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడతున్నాయి. మౌనికి సీమంతం ఎంతో సింపుల్ గా జరిగింది. ఆళ్లగడ్డలోని తన పుట్టింటిలో మౌనిక సీమంత వేడుకలు ఎంతో సింపుల్ గా జరిగాయి. మనోజ్.. తన భార్యకు దగ్గర ఉండి సీమంతం జరిపించాడు. అయితే ఈ వేడుకలో మంచు కుటుంబం కనిపించకపోవడం గమనార్హం.

చివరికి వీరికి దగ్గర ఉండి పెళ్లి చేసిన మంచు లక్ష్మీ కూడా ఈ వేడుకలో కనిపించలేదు. మొదటి నుంచి వీరి పెళ్ళికి మంచు కుటుంబం సుముఖత చూపించలేదని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, పెళ్ళిలో మోహన్ బాబు,మౌనిక కూడా తన కూతురే అని చెప్పడంతో వీరు కలిసిపోయారు అనుకున్నారు. కానీ, మనోజ్.. మంచు కుటుంబం నుంచి బయటకు వచ్చేసాడని వార్తలు వస్తున్నాయి. ఈ పెళ్లి తరువాత కూడా మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు కూడా వచ్చిన సంగతి తెలిసిందేజరిగిన సంగతి తెల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu