HomeTelugu Big Storiesతండ్రి కాబోతున్న మంచు మనోజ్‌

తండ్రి కాబోతున్న మంచు మనోజ్‌

manchu manoj wife bhuma mou

మంచు మనోజ్‌ తన ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్ అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు తన భార్య మౌనిక రెడ్డి ప్రెగ్నెంట్‌ అంటూ తన అభిమానులతో ఈ విషయాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నాడు.

“నా అత్తమ్మ శ్రీ భూమా శోభా నాగిరెడ్డి గారిని ఆమె పుట్టినరోజు సందర్భంగా స్మరించుకుంటూ ఓ శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. అత్తమ్మ మీరు, మా మావయ్య శ్రీ భూమా నాగిరెడ్డి మరోసారి గ్రాండ్ పేరెంట్స్ అవ్వబోతున్నారు. అన్నయ్య అవుతున్నందుకు ధైరవ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. మీరు పైనుంచి మమ్మల్ని చూస్తూ ఎప్పుడూ ఇలానే ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను.

మా అమ్మ శ్రీ నిర్మల గారు, మా నాన్నగారు శ్రీ మోహన్ బాబు గారి ఆశీస్సులతో, మా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది.” అంటూ మంచు మనోజ్ పోస్ట్ చేశాడు.

రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక రెడ్డిని ఈ ఏడాది మార్చిలో మనోజ్ రెండో వివాహం చేసుకున్నాడు. అంతకు ముందు 2015లో ప్రణీత్ రెడ్డిని వివాహం చేసుకుని 2019లో విడాకులు తీసుకున్నాడు. మనోజ్‌ను పెళ్లి చేసుకునే సమయానికి మౌనికకు ఓ కొడుకు ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu