HomeTelugu Trendingమనోజ్‌ రెండో పెళ్లి.. షాక్‌లో హీరో!

మనోజ్‌ రెండో పెళ్లి.. షాక్‌లో హీరో!

Manchu manoj reacts on his

హీరో మంచు మనోజ్‌ రెండోపెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఓ విదేశీ యువతిని ఆయన పెళ్లి చేసుకోనున్నారని.. అందుకు కుటుంబసభ్యులు సైతం పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయ్యారని గత కొన్నిరోజుల నుంచి వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు వార్తలపై తాజాగా మంచు మనోజ్‌ షాక్‌కు గురయ్యారు. అవన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పేశారు. ‘దయచేసి.. నన్ను కూడా పెళ్లికి పిలవండి. ఇంతకీ పెళ్లి ఎక్కడ చేస్తున్నారు? ఆ బుజ్జి, తెల్ల పిల్ల ఎవరు?! మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం!!” అని మనోజ్‌ ట్వీట్‌ చేశారు. దీంతో మనోజ్‌ పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని మరోసారి స్పష్టత వచ్చింది.

Manchu manoj 1

హైదరాబాద్‌కు చెందిన ప్రణతీరెడ్డితో 2015లో మనోజ్‌ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. వ్యక్తిగత జీవితంలో మనస్పర్థలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ 2019లో వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. ఆనాటి నుంచి మనోజ్‌ రెండో పెళ్లి చేసుకోనున్నారంటూ ఎన్నో సార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక, సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాతో బిజీగా ఉన్నారు. పాన్‌ ఇండియా సినిమాగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో మనోజ్‌ విభిన్నమైన గెటప్‌లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu