HomeTelugu Trendingమంచు మనోజ్‌ కొత్త సినిమా ప్రకటన

మంచు మనోజ్‌ కొత్త సినిమా ప్రకటన

Manchu manoj new movie anno

మంచు మనోజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేసింది. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని క్లారిటీ రావాల్సి ఉంది. తాజాగా మనోజ్‌ ఓ ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చాడు. మంచు మనోజ్‌ కొత్త సినిమా ప్రకటించాడు.

‘నేను సినిమా చేసి చాలా రోజులైంది.. కానీ ఇన్నాళ్లూ నేను మీ అందరి ప్రేమను కలిగి ఉండేలా ఆశీర్వదించబడ్డాను. మీ ప్రేమను తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇదిగో నా కొత్త సినిమా ప్రకటిస్తున్నా. మీ అందరకీ క్రేజీ అనుభవాన్ని అందించే క్రేజీ సినిమా ‘WhatThe Fish’ అని ట్వీట్ చేశాడు మనోజ్. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. డెబ్యూ డైరెక్టర్‌ వరుణ్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించబోతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu