HomeTelugu NewsManchu Manoj: వారినే ఎన్నుకోండి.. ఓటర్లకు హీరో సలహా!

Manchu Manoj: వారినే ఎన్నుకోండి.. ఓటర్లకు హీరో సలహా!

Manchu manoj interesting comments on vote

Manchu Manoj: టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మోహన్‌బాబు విశ్వవిద్యాలయ వార్షికోత్సవం, ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని తాజా తిరుపతిలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈవేడుకలో.. నటులు మోహన్‌లాల్‌, ముఖేశ్‌ రుషి పాల్గొన్నారు. ఇందులో భాగంగా మంచు మనోజ్‌ ఓటు హక్కుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

”అందరితో కలిసి ముందుకు వెళ్తున్నాడా? ఏమైనా దారుణాలకు పాల్పడుతున్నాడా? అనేది విశ్లేషణ చేసి పది మందితో కలిసి ముందుకు సాగే సరైన లీడర్‌ను ఎన్నుకోండి. కుటుంబానికి, చుట్టుపక్కల వాళ్లకే సాయం చేయలేని వారు మీకేం హెల్ప్‌ చేస్తారు. అది గుర్తు పెట్టుకుని.. మీకు, మీ ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు ఎవరు వస్తే అండగా ఉంటారో విశ్లేషించి ఓటు వేయండి. డబ్బులిచ్చారని వేయొద్దు. మీకు నచ్చిన వాళ్లను ఎన్నుకోండి” అని మనోజ్‌ అన్నారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మోహన్‌బాబు మాట్లాడుతూ.. ”విలన్‌గా నేనూ ఎన్నో సినిమాల్లో చేశా. ఇప్పటికీ ఆ పాత్రల్లో నటించడమంటే ఇష్టం. విలన్‌ పాత్రల్లో నటనకు స్కోప్‌ ఎక్కువగా ఉంటుంది. నా మిత్రుడు మోహన్‌లాల్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయన నటించిన ‘చిత్రం’ను తెలుగులో ‘అల్లుడుగారు’గా తీసి విజయాన్ని అందుకున్నా. ఆనాటి నుంచి మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. ‘కన్నప్ప’లో యాక్ట్‌ చేసినందుకు ఇప్పటివరకూ ఆయన ఒక్క రూపాయి తీసుకోలేదు”

”కులమతాలకు అతీతంగా ఉచితవిద్య అందించాలనే ఉద్దేశంతో కాలేజీ ప్రారంభించా. అది అంచెలంచెలుగా ఎదిగి విశ్వవిద్యాలయంగా మారింది. పాండిబజార్‌లో ఉన్నప్పుడు ఇడ్లీ తినడానికి కూడా డబ్బుల్లేక నీళ్లు తాగి నిద్రపోయిన రోజులు నాకింకా గుర్తున్నాయి. నాకున్న దానిలో పిల్లల చదువు కోసం ఇవ్వాలనుకుని కాలేజీ మొదలుపెట్టా”

”ఒక్కొక్కసారి ఆలోచించి కూడా మనం తప్పు చేస్తాం. ఎవరికి ఓటు వేయాలనేది మనం నిర్ణయించుకోలేం. స్థానిక రాజకీయ పార్టీల గురించి నేను మాట్లాడటం లేదు. భారత ప్రధానిగా మరోసారి మోడీ వస్తేనే ఈ దేశం మరింత వృద్ధి చెందుతుందని నమ్ముతున్నా. ఆలోచించి ఓటు వేయండి. అన్ని పార్టీలు డబ్బులిస్తాయి. అవి మనవే. లంచాల రూపంలో తీసుకున్నవే. మనసుకు నచ్చినవాళ్లకు ఓటు వేసి దేశ భవిష్యత్తు కోసం యువత సహకరించండి” అని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu