మంచు వారసుడిగా ‘2004’లో దొంగ దొంగది సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన మనోజ్ అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. ఒకే జానర్లో సినిమాలు చేయకుండా ప్రేక్షలు మెచ్చే విధంగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. సినీ హీరోగా మాత్రమే కాకుండా సామజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా కూడా మంచు మనోజ్ గురించబడ్డాడు. తన పుట్టినరోజునాడు మనోజ్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు. వలస కార్మికులకు సహాయ సహకారాలు అందించాలని సంకల్పించారు.
సొంతగ్రామాలకు వెళ్లే వలస వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు చేతనైన సహాయం చేసి వారిని క్షేమంగా సొంత ప్రాంతాలకు వెళ్లేలా చూసేందుకు సిద్ధం అవుతున్నారు. పుట్టినరోజునాడు మంచి పని చేయడం అంటే చాలా సంతోషమైన పని. మంచు మనోజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’ షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.