టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి గురించిన వార్తలు సోషల్ మీడియాలో గతకొన్న రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వినాయక చవితి మండపాల్లో మనోజ్ ఏపీలో ఒక పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన భూమా మౌనిక రెడ్డి తో కలిసి సందర్శించడంతో ఈ ప్రచారం మొదలైంది.
తాజాగా టాలీవుడ్‌లో మరో ఆసక్తికర టాక్ వినిపిస్తుంది. మనోజ్- మౌనిక వచ్చే నెల మూడో తేదీన అంటే మార్చి 3న వివాహం చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వివాహానికి సంబంధించి మంచు మనోజ్ ఒక అధికారికి ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని కూడా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
మంచు మోహన్ బాబు ఫ్యామిలీకి భూమా కుటుంబంతో సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. మౌనిక రెడ్డికి కూడా ఇదివరకే పెళ్లి అయింది. ఈ పెళ్లి సైతం మంచు ఫ్యామిలీ హాజరైంది. ఆ సమయంలో మంచు మనోజ్ కూడా అక్కడే ఉన్నారు. తరువాత మంచు మనోజ్ ప్రణతి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకోవడం పెద్దలు దానికి అంగీకారం తెలపడం అన్నీ జరిగిపోయాయి. అనూహ్యంగా వారిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు.
భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డి కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఇక వీరిద్దరూ ప్రేమలో పడినట్లుగా ఒక్కసారిగా ప్రచారం మొదలైంది. ఈ విషయాన్ని మంచు ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీ కూడా ఖండించకపోవడంలతో ఇది నిజమేనని అందరూ భావించారు.
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు