HomeTelugu Trendingమంచు మనోజ్ 'అహం బ్రహ్మాస్మి'కి క్లాప్‌ కొట్టిన రామ్‌ చరణ్‌

మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’కి క్లాప్‌ కొట్టిన రామ్‌ చరణ్‌

3 5
మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’. ఈ మూవీ షూటింగ్‌ ఈ రోజు ఉదయం హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఓ దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో యంగ్ హీరో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. చరణ్‌కి మంచు కుటుంబం సాదర స్వాగతం పలికింది. రామ్‌ చరణ్ క్లాప్‌ కొట్టి ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు. మంచు లక్ష్మితో పాటు సుస్మిత కొణిదెల కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు. తన కూతురితో కలిసి మంచు లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేసింది.

ఈ కార్యక్రమంలో రామ్‌ చరణ్‌ మెడలో మోహన్‌ బాబు పూల దండ వేశారు. అనంతరం మోహన్‌ బాబు కాళ్లకు నమస్కరించి చెర్రీ ఆశీర్వాదం తీసుకున్నాడు. మంచు మనోజ్ మూడేళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్, దర్శకుడిగా శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu