టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. మార్చి 3న వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే వీరి పెళ్లి ఏర్పాట్లు అన్నీ పూర్తైయ్యాయట. తాజాగా దీనిపై మంచు మనోజ్ స్పందించాడు.
మౌనిక లాంటి వ్యక్తి నా జీవితంలో ఉండటం నా అదృష్టం. తామిద్దరం మొదట మిత్రలమని, తర్వాత అది ప్రేమగా మారింది అని, కష్టసయమంలో మౌనిక తనకు అండగా నిలబడింది అని తెలిపాడు.
మనోజ్ అక్క మంచు లక్ష్మి నివాసంలో సింపుల్ గా కొంత మంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరగనుందని సమాచారం. కాగా, మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. కానీ, విభేదాలు రావడంతో 2019లో ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
మౌనిక సైతం తన భర్తతో విడిపోయింది. కాగా మంచు మనోజ్ వెండితెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. ఇటీవల ‘వాట్ ది ఫిష్’ టైటిల్ తో ఓ చిత్రం చేస్తున్నట్టు వెల్లడించాడు.
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు